మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా...



ప్రస్తుత రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) ఎంతో కీలకంగా మారింది. ఈ క్రమంలో 12 అంకెల బయోమెట్రిక్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదాయపు పన్ను శాఖ తెలపింది. గడువు సైతం దగ్గరపడుతోంది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ (Income Tax department) మార్గదర్శకాల ప్రకారం మార్చి 31, 2023 నాటికి పాన్-ఆధార్ లింక్ చేయాలి. ఎవరైతే లింక్ చేయకపోతే వారి పాన్ కార్డు ఏప్రిల్ 1 నుంచి పని చేయదని స్పష్టం చేసింది. 

ఇప్పటికే మొదట పేర్కొన్న గడువు ముగిసింది. ఇప్పుడు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలన్నా రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి డెడ్‌లైన్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంది. కాబట్టి.. ఆ లోగా చేసుకోవాలని కోరుతోంది ఐటీ శాఖ. పాన్ కార్డు నిరుపయోగంగా మారితే ఇకపై బ్యాంకు అకౌంట్లు, డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు ఆస్కారం ఉండదు.

చేసుకోకపోతే ఏం జరుగుతుంది?

2023 మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు చెల్లుబాటు కాదు. ఒక్కసారి పాన్ కార్డు ఇన్‌ఆపరేటివ్ అయిపోతే.. మీరు ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. బ్యాంక్ అకౌంట్ కూడా తెరవలేరు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేరు. ఇలా చాలా రకాల సర్వీసులు పొందలేకపోవచ్చు. ఇంకా అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్లు నిర్వహించలేరు. అంతేకాకుండా రూ. 10 వేల వరకు జరిమానా కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా ఆధార్-పాన్ లింక్..

తొలుత ఆదాయపు పన్ను శాక అధికారిక వెబ్ సైట్ eportal.incometax.gov.in or incometaxindiaefiling.gov.in లోకి లాగిన్ కావాలి.

మీరు రిజిస్టర్ కాకపోతే మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ నంబర్ మీ యూజర్ ఐడీగా క్రియేట్ చేయాలి.

తర్వాత మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, జన్మదినం ద్వారా పోర్టల్ లోకి లాగిన్ కావాలి.

మీ డెస్క్‌టాప్ స్క్రీన్ పై పాపప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

ఒకవేళ పాపప్ నోటిఫికేషన్ కనిపించకపోతే.. క్విక్ లింక్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.

ఆ తర్వాత లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగా ఆధార్ నంబర్, పేరు, పాన్ నంబర్ ఎంటర్ చేయాలి.

డేట్ లేకుండా పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card పై క్లిక్ చేయాలి.

తర్వాత క్యాప్షా కోడ్ ఎంటర్ చేయాలి.

ఆధార్, పాన్ కార్డు వివరాలు సరిపోతే.. తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

పైన పేర్కొన్న లింకులు ఓపెన్ కాని సందర్భంలో utiitsl.com, egov-nsdl.co.in ద్వారా పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.