దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు...
పథకం కోసం అవసరమైన పత్రాలు క్రిందివి....
- నివాస ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- మొబైల్ నంబర్ , ఇమెయిల్ ID
- రేషన్ కార్డు ఆధార్ కార్డ్
ప్రత్యేక బృందాల తనిఖీలు....
ఆగస్టు 10వ తారీఖు వరకు వచ్చిన దరఖాస్తుల జాబితా రూపొందించి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి విచారణ చేపడతామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, సొంత ఇండ్లు లేని వారికి, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 కింద లబ్ది పొందని వారిని అర్హులుగా ఎంపిక చేయడం జరుగుతుందని , ఆగస్టు 20వ తారీకు వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, ఆగస్టు 25 నాటికి జిల్లాకు కేటాయించిన గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
మార్గదర్శకాలు ఇవే….
- సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
- వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది.
- రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు.
- రాష్ట్ర రిజర్వు కోటాలో 43 వేల మందికి, మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందనుంది.
- కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి.
- జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
- రెండు గదులతో ఆర్‌సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం సాయం చేస్తుంది.
- 4 లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తారు.
- ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రభుత్వం తెలిపింది. దివ్వాంగులకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లను ప్రకటించింది ప్రభుత్వం.