ఆగస్ట్ నెల ముగియబోతోంది. ఈ నెలాఖరులోపు కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు చేసుకోవడం బెటర్. లేకపోతే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని కొన్ని పనులను గడువులోపు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. లేకపోతే ఆర్థిక నష్టాలతో పాటు మరిన్ని చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. మీరు ఆరోగ్య శ్రీ, ఆయుష్మన్ భారత్ లబ్ధిదారులైతే అందుకు సంబంధించిన KYC చేయడానికి గడువు ఆగస్టు 30తో ముగియనుంది. నెలాఖరులోపు మీరు KYC పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
ఈ కార్డు యొక్క లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వైద్య వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది.