తెలంగాణ ప్రజలకు శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా.. త్వరలో కొత్త డిజిటల్ కార్డులు..


తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలోనే కొత్త డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులందరికీ ఈ కార్డులను అందించనుంది. ఇప్పటివరకు లబ్ధిదారులను గుర్తించడానికి బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్‌ను వాడనున్నారు. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అభివృద్ది చేస్తోంది.

ఆరోగ్యశ్రీ బీమా పథకం ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న రూ.2 లక్షల బీమా కవరేజీని రూ.5 లక్షలకు పెంచాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులను గుర్తించి వెరిఫైడ్ డిజిటల్ కార్డులను త్వరలో జారీ చేయనున్నారు. నేరుగా ఆధార్ వెరిఫికేషన్ ద్వారా లబ్ధిదారులు, వారి చిరునామాను ధృవీకరించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను జారీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆరోగ్య శ్రీ సేవలు, డిజిటల్ కార్డుల జారీపై మంగళవారం అధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించడంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సేవలపై ఆడిట్ నిర్వహించేందుకు నిమ్స్‌కు చెందిన సీనియర్ల డాక్టర్ల బృందాన్ని నియమించారు.

హెల్త్ కార్డ్ అప్లయ్, kyc, ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ కొసం సంప్రదించండి...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.