ఆధార్' తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వన్ నేషన్ వన్ ఐడీ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ఈ కార్డు జారీ చేయనున్నారు. అపార్ కార్డు పేరుతో దీన్ని తీసుకురానున్నారు. అపార్‌కార్డ్ అంటే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అపార్ కార్డ్ పేరుతో వన్ నేషన్-వన్ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనుంది కేంద్రప్రభుత్వం. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించడం జరిగింది.
17 అంకెలున్న సంఖ్య...
ఈ కార్డుతో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే దగ్గర పొందుపరిచేలా చేస్తోంది కేంద్రం. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు..అన్ని వివరాలు ఇందులో ఉండనున్నాయి. పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడేలా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించడం జరుగుతుంది.
అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ఇలాంటి పద్ధతులను అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్నిఅమలు చేస్తుంది. ఇప్పడు కేంద్రం మరో సంఖ్యను ఇవ్వబోతుంది. కేంద్రం జారీ చేసే ఈ నంబర్ ఒక్కటే సరిపోతుంది. దేశం మొత్తంలో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకూ చదివే విద్యార్థులు సుమారు 26 కోట్ల మంది విద్యార్థులున్నారు. వీరికోసం 17 అంకెలున్న సంఖ్యను ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.