ఆధార్ కార్డు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగమై పోయింది. ఎక్కడికి వెళ్లినా ఈ కార్డు తప్పనిసరి. ఏది దరఖాస్తు చేసుకోవాలన్నా దీన్ని వాడాల్సిందే. ఈ కార్డు లేనిదే ఏ పని జరగదు. ఆ విషయం మీకు తెలియంది కాదు. పదేళ్ల నుంచి మీ గుర్తింపుకు వాడుతున్న కార్డు ఇదే. అయితే పదేళ్ల కిందట ఈ కార్డు పొందిన వారికి అలర్ట్. ఈ కార్డులోని సమాచారాన్ని మీరు వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. దీనిపై ఆధార్ నెంబర్లను జారీ చేసిన సంస్థ UIDAI కీలక ప్రకటన జారీ చేసింది.
పదేళ్ల కిందట ఎవరైనా వ్యక్తులు ఆధార్ కార్డును పొంది, ఇన్నేళ్లు అయినా ఒక్కసారి కూడా తమ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోకపోతే, వెంటనే డాక్యుమెంట్ అప్‌డేషన్ చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం’’ అంటూ యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ అప్‌డేషన్ ప్రక్రియకు కాస్త ఫీజును ఆధార్ కార్డు యూజర్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మై ఆధార్ పోర్టల్‌లో ఈ అప్‌డేషన్ సౌకర్యాన్ని పొందవచ్చని దగ్గర్లోని CSC CENTRE, ఆధార్ కేంద్రానికి వెళ్లి ఈ అప్‌డేట్ చేసుకోవాలని పిలుపునిచ్చింది.
ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటితే మీ డెమోగ్రాఫిక్ వివరాలను లేదా బయోమెట్రిక్స్ ఒకసారి అప్‌డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని యూఐడీఏఐ పలు సందర్భాల్లో ఆధార్ కార్డుదారులకు అవగాహన కల్పిస్తోంది. ఇలా చేయడం వల్ల ట్రాన్సాక్షన్ల అథంటికేషన్ ఫెయిల్ అయ్యే సమస్య ఉండదు. మీరు ప్రస్తుతం ఉచితంగానే ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. 2023, సెప్టెంబర్ 14 వరకు మీకు వివరాల ఉచిత అప్‌డేట్‌కు అవకాశం ఉంది. గతంలో ఈ గడువు ఆగస్టు 14 వరకే ఉండేది. కానీ, మరో అవకాశం కల్పిస్తూ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది యూఐడీఏఐ. అయితే, ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌కు మాత్రమే ఈ ఉచిత ఆప్షన్ లభిస్తుంది. అలాగే ఆన్‌లైన్ ద్వారా మీ అడ్రస్, పేరు, మొబైల్ నంబర్ వంటి డెమోగ్రాఫిక్ వివరాలు మాత్రమే సరి చేసుకునే వీలుంటుంది. బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలు అప్‌డేట్ చేసుకుంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.